‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’

11 May, 2022 07:23 IST|Sakshi
విఘ్నేశ్వరన్‌ (ఫైల్‌)

వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకా సాత్తూరు గ్రామానికి చెందిన విఘ్నేశ్వరన్‌(26) కాంచీపురంలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో గత  10 రోజులుగా సెలవు పెట్టి స్వగ్రామంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కాంచీపురం వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ప్రయాణమయ్యాడు. సాయంత్రం వాలాజ టోల్‌గేట్‌ నుంచి విఘ్నేశ్వరన్‌ తన తండ్రి ఏయుమలైతో సెల్‌ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తుంది.
ఆ సమయంలో ‘నాన్న నన్ను క్షమించు, నాకు బతకడం ఇష్టం లేదని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెప్పి’.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏయుమలై తన బంధువులతో కలిసి కారులో వాలాజ టోల్‌గేట్‌ వద్దకు చేరుకొని గాలించగా విఘ్నేశ్వరన్‌ ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని చూసి కన్నీరు  మున్నీరయ్యారు. వాలాజ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య 

మరిన్ని వార్తలు