బంధువుల వేడుకకు తీసుకెళ్లలేదని.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

8 Dec, 2021 21:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: బంధువుల వేడుకకు తీసుకెళ్లలేదని భర్తపై కోపంతో అభంశుభం తెలియని పిల్లలను బావితో తోసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కులితలై సమీపంలోని సెంబియం గ్రామానికి చెందిన శక్తి వేల్‌ (35) టైలర్‌. భార్య శరణ్య(30), కుమార్తెలు కనిష్క(6), పుదిషా(3) ఉన్నారు. నాచ్చిముత్తు పాళ యంలో బంధువుల ఇంటి వేడుకకు సోమవారం రాత్రి  శక్తివేల్‌ వెళ్లాడు.

తమకు చెప్పకుండా భర్త మాత్రమే వెళ్లడంతో ఆగ్రహించిన శరణ్య పిల్లలిద్దరిని ఇంటి సమీపంలోని బావిలో పడేసింది. తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మంగళవా రం ఉదయం ఇంటికి వచ్చిన శక్తివేల్‌ భార్య పిల్ల లు కనిపించకపోవడంతో గాలించారు. బావిలో శరణ్య మృతదేహం కనిపించింది. అతి కష్టంతో పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: బెంజ్‌ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి..
చదవండి: మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి

మరిన్ని వార్తలు