కడుపులో 108 డ్రగ్స్‌ క్యాప్యూల్స్‌.. అడ్డంగా బుక్కయ్యాడు..

4 May, 2022 14:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి కడుపులో ఏకంగా 108 డ్రగ్స్‌ క్యాప్యూల్స్‌ను కనిపెట్టారు. పట్టుకున్న డ్రగ్స్‌ విలువ రూ. 11.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడు జోహెన్స్‌బర్గ్‌ నుంచి అబుదాబీ మీదుగా వచ్చాడని అధికారులు వెల్లడించారు. కడుపులో డ్రగ్స్‌ రవాణా చేయడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు