పబ్బులో అశ్లీల నృత్యాలు...

1 Jun, 2022 09:04 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌లోని మరో పబ్బుపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఈ పబ్బులోనూ అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళలను, పురుషులను అదుపులోకి తీసు కున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ ఎస్డీరోడ్‌లోని బసేరా హోటల్‌లో పబ్‌ను నిర్వహిస్తున్నారు. డీజే సౌండ్‌ల హోరులో యువతీ, యువకులు అశ్లీలంగా నృత్యాలు చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా పబ్‌ యాజమాన్యం ఈ దందా కొనసాగిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి కస్టమర్ల తరహాలో పబ్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ యువతీ, యువకులు తాగిన మైకంలో నృత్యాలు చేస్తున్నారు. మహిళలు పురుషుల వద్దకు వచ్చి వారిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. వారిలో 9 మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్‌ సిబ్బంది ఉన్నారు. హోటల్‌ యజమాని అమర్‌ ఓరీ పరారీలో ఉన్నాడు.  

(చదవండి: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం..)

మరిన్ని వార్తలు