గంజా విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్టు

23 Sep, 2020 19:55 IST|Sakshi
కూకట్‌పల్లి పోలీసులకు పట్టుబడ్డ నిందితులు

సాక్షి, విజయవాడ : నగర శివారులో 800 కిలోల గంజాయిని బుధవారం టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రామవరప్పాడు వద్ద తనిఖీలు చేపట్టగా... లారీలో తరలిస్తున్న సుమారు 80 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం నుంచి కొయంబత్తూరుకు లారీలో  మొక్క జొన్న పిండి బస్తాల చాటున తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, లారీని సీజ్​ చేసినట్లు ఆయన (గంజాయి రవాణా చేసే నార్త్‌ ముఠాకు చెక్‌)

కూకట్‌పల్లిలో నలుగురు అరెస్ట్‌
సాక్షి, హైదరాబాద్‌ : గంజా విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో గంజా అమ్మడానికి సిద్ధంగా ఉన్న యువకులను మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నవీన్ కుమార్, ఆనంద్, అనంత్ కుమార్, శ్రవణ్  అరెస్టు అయ్యారు. వీరు ఖమ్మం సత్తుపల్లి నుంచి 3.5 కిలోల గంజా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఎస్‌ఓటీ పోలీసులు.. కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..)

మరిన్ని వార్తలు