ఎన్టీఆర్‌‌ వర్థంతి కార్యక్రమంలో విషాదం

19 Jan, 2021 09:57 IST|Sakshi

విద్యుత్‌ షాక్‌తో టీడీపీ కార్యకర్త మృతి

సాక్షి, దర్శి టౌన్‌: ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో విద్యుదాఘాతానికి గురై టీడీపీ కార్యకర్త మృతి చెందిన ఘటన దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది. గ్రామంలో సోమవారం ఎన్‌టీఆర్‌ వర్థంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గ్రంథాలయం ఎదురుగా జెండా దిమ్మె వద్ద ఇనుపరాడ్‌కు టీడీపీ జెండా ఎత్తుతుండగా బ్యాలెన్స్‌ తప్పి ఇనుప రాడ్‌ పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలపై పడింది. రాడ్‌ పట్టుకొని ఉన్న టీడీపీ కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ(36) విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతునికి భార్య మహాలక్షి్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆ పార్టీ నియోజక వర్గ నియోజక వర్గ సమన్వయకర్త పమిడి రమేష్‌లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన స్థలాన్ని ఎస్సై రామకోటయ్య సందర్శించి వివరాలు సేకరించారు. హెచ్‌సీ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. చదవండి: ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు