నిరసన దీక్ష పేరుతో హైడ్రామా 

20 Jan, 2021 03:59 IST|Sakshi
దేవినేని ఉమాను అరెస్టు చేసి తరలిస్తున్న పోలీసులు

 మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

భవానీపురం(విజయవాడ పశ్చిమ): మంత్రి కొడాలి నాని తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసన దీక్ష పేరుతో హైడ్రామాకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెరలేపారు. మంగళవారం ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తననెవరూ గుర్తుపట్టకుండా నెత్తిన టోపీ, ముఖానికి మాస్క్‌ ధరించి ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు ఉమాను అరెస్టు చేసి పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీలు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో అక్కడకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. కాగా, దేవినేని ఉమాను మంగళవారం సాయంత్రం పమిడిముక్కల పోలీసులు విడుదల చేశారు. 

ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం  
ఉమా హైడ్రామా నేపథ్యంలో మంగళవారం ఉదయం గొల్లపూడిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేత తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ, ఎంపీ నందిగం సురేష్లు అక్కడినుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చివరికి చంపేసిన చంద్రబాబు, వదినను చంపేసిన ఉమా ఆయన విగ్రహానికి దండేసి ఆత్మక్షోభకు గురిచేసినందుకు నిరసనగా క్షీరాభిõÙకం చేశామన్నారు. 

మరిన్ని వార్తలు