టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీకి హైకోర్టు అనుమతి

3 May, 2021 20:10 IST|Sakshi

సాక్షి, అమరావతి : సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీకి  తీసుకున్నారు. ఆయనను మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ ఏసీబీ హై కోర్టును ఆశ్రయించారు.

ధూళిపాళ్ల నరేంద్రను కోర్టు మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. సంగం డెయిరీకి సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లపై 408, 409, 418, 420, 465, 471, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో  ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా ఏ2 గోపాలకృష్ణను రెండురోజులపాటు, ఏ3 గురునాథంను ఒకరోజు పాటు హైకోర్టు కస్టడీకి అప్పగించింది.

చదవండి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌

మరిన్ని వార్తలు