టీడీపీ నేత బరితెగింపు.. వివాహితపై..

21 Nov, 2020 16:23 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాయదుర్గం నియోజవర్గంలో టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. డి.హీరేహల్‌ మండలం దొడగట్టలో వివాహితపై టీడీపీ నేత శ్రీనివాస్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అతని వేధింపులు భరించలేక వివాహిత పోలీసులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివాహిత ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై 358, 534,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, శ్రీనివాస్‌ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌ అనుచరుడిగా ఉన్నాడు. అధికారంలో ఉన్న సమయంలోనూ శ్రీనివాస్‌ పలు అరాచకాలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు