టీడీపీ నేతల గూండాగిరి 

24 Sep, 2020 11:06 IST|Sakshi
టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుబ్బారెడ్డి

ఉపాధి హామీ అధికారులపై దాడి

శాంతిపురంలో ఘటన 

శాంతిపురం(చిత్తూరు జిల్లా): ఉపాధి హామీ అధికారులపై టీడీపీ నాయకులు గూండాగిరి ప్రదర్శించారు. వారిని బెదిరించి తమ చెప్పుచేతుల్లో పెట్టుకునే యత్నంలో భాగంగా భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన శాంతిపురం మండలంలో బుధవారం కలకలం రేపింది. ఉపాధిహామీ ఏపీఓ అశోక్‌రెడ్డి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. టీడీపీ మండల అధ్యక్షుడు జనార్దనరెడ్డి ఉపాధిహామీ పనుల కింద అక్రమంగా బిల్లులు పెట్టాడు. వీటిని తిరస్కరించడంతో రెచ్చిపోయాడు. శాంతిపురం ఉపాధి హామీ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏపీఓ అశోక్‌రెడ్డిపై ఆయన సోదరుడు రాజశేఖరరెడ్డితో కలిసి దౌర్జన్యం చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన గుంజార్లపల్లె ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సుబ్బారెడ్డిని విచక్షణా రహితంగా కొట్టి బట్టలు చింపేశాడు. సిబ్బంది ఆత్మరక్షణ కోసం ఆఫీసు లోపల

గడియ పెట్టుకున్నా రాద్దాంతం చేసి, తలుపులు తీయించారు. ఫోన్లు చేసి తమ పార్టీ శ్రేణులను పిలిపించుకుని కార్యాలయంలోని కంప్యూటర్‌ మానిటర్, ప్రింటర్, కాట్రేజ్‌లు, రెండు కుర్చీలను ధ్వంసం చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులు కుప్పం–పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించారు. దాడికి గురైన ఏపీఓ, ఫీల్డు అసిస్టెంట్లను ఎంపీడీఓ చిన్నరెడ్డెయ్య కారులో పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయడంతో వారినీ అడ్డుకున్నారు. పోలీసుల ఎదుటే దుర్భాషలాడుతూ కారుపై దాడికి యత్నించారు. కుప్పం రూరల్‌ సీఐ యతీంద్ర, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ మురళీమోహన్‌ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి, వారిని తరలించారు. అధికారుల ఫిర్యాదుకు కౌంటరుగా టీడీపీ నాయకులు కూడా తమపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

మరిన్ని వార్తలు