డబ్బు, ముక్కుపుడకలు పంచిన టీడీపీ 

13 Nov, 2021 06:45 IST|Sakshi
ఓటర్లకు టీడీపీ వారు పంచి పెట్టిన ముక్కుపుడక   

సాక్షి,విడవలూరు (నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది. 2వ వార్డు టీడీపీ అభ్యర్థి జూగుంట కళ్యాణ్‌ ఓటుకు రూ.వెయ్యి నగదు, బంగారు ముక్కపుడక పంచిపెట్టారు.

3వ వార్డు టీడీపీ అభ్యర్థి బట్టా ప్రవల్లిక తరఫున కార్యకర్త ఉసురుపాటి ప్రసాద్‌ నగదు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రసాద్‌ వద్ద రూ.12 వేల నగదునుస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు