టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అరెస్ట్‌

3 Jan, 2021 17:05 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్‌ కాకుండా, బెయిల్‌ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. (చదవండి: ‘సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి’)

ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. 2018లో జరిగిన అల్లర్ల కేసులో బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. గతంలో జరిగిన అల్లర్ల కేసులో పలువురికి బెయిల్‌ లభించిందని, నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ వివరించారు. లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.(చదవండి: పచ్చ దౌర్జన్యాలు)

మరిన్ని వార్తలు