సర్పంచ్‌ కొడుకా.. ఛీ ఇవేం పనులు

17 Jul, 2021 14:53 IST|Sakshi
జగనన్న కాలనీలో మోటారు బోరు పైపును తొలగిస్తున్న మాధవరావు

సాక్షి, ఇచ్ఛాపురం(‍శ్రీకాకుళం): అధికారంలో ఉండగా ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చలాయించిన టీడీపీ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తమ పాచికలు పారకపోవడంతో బరితెగిస్తున్నారు. మశాఖపురం పంచాయతీ సర్పంచ్‌ ఆశి తులసమ్మ కొడుకు, టీడీపీ నేత మాధవరావు సహనం కోల్పోయి అభివృద్ధినే అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చరిత్రలో లేని విధంగా జగనన్న కాలనీలో పేదలకు ఇళ్లు పంపిణీ చేయడంతో సదరు వ్యక్తికి కన్నుకుట్టింది.

ప్రస్తుతం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ఇటీవల కాలనీలో వేసిన మోటారు బోరుకు సంబంధించి విద్యుత్‌ లైన్‌ దౌర్జన్యంగా కట్‌ చేయడంతో పాటు పైపులను తొలగించడంతో లబ్ధిదారులు శుక్రవారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటిని ఇప్పించాలని, అదే విధంగా ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్న సర్పంచ్‌ కుమారుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడివో, తహసీల్దార్లను కోరారు.
 

మరిన్ని వార్తలు