అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతల అరెస్టు 

20 Nov, 2022 19:13 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజు

గుడివాడ రూరల్‌(కృష్ణా జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఫొటోలతో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతలను అరెస్ట్‌ చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ గోవిందరాజు తెలిపారు.

స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ నాయకురాలు, మాజీ కౌన్సిలర్‌ రేమల్లి ప్రభోద రాణి ఫిర్యాదు మేరకు సోషల్‌ మీడియాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ నాయకురాలు అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, మాదాల సునీత, బంటు రోజాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిపై నాన్‌బెయిల్‌ సెక్షన్‌ 505–2 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు.
చదవండి: నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం!   

మరిన్ని వార్తలు