విద్యార్థినులను వేధించిన టీచర్‌కు 49 ఏళ్ల జైలు

20 Jan, 2021 07:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై ‌: ఆరుగురు విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... పుదుక్కోట్టై జిల్లా, గంధర్వకోట దువార్‌ గ్రామానికి చెందిన అన్బరసన్‌ (52) నరియన్‌పుదుపట్టి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ వచ్చాడు. విద్యారి్థనులు ఆరుగురిపై 2018లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనిపై హెచ్‌ఎం జ్ఞానశేఖరన్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో పుదుక్కోట్టై మహిళా పోలీసుస్టేషన్‌లో ఇద్దరిపై ఫిర్యాదు అందింది. దీంతో అన్బరసన్, జ్ఞానశేఖరన్‌ పోక్సో చట్టం కింద అరెస్టయ్యారు. ఈ కేసులో పుదుక్కోట్టై మహిళా కోర్టు న్యాయమూర్తి సత్య సోమవారం తీర్పునిచ్చారు.

అందులో ఉపాధ్యాయుడు అన్బరసన్‌కు 49 ఏళ్ల జైలు శిక్ష, హెచ్‌ఎం జ్ఞానశేఖరన్‌కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత ఆరుగురు విద్యార్థినులకు తలా రూ.లక్షా యాభై వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని తీర్పులో వెల్లడించారు. 

నలుగురికి యావజ్జీవం 
కడలూరు జిల్లా, అళిచ్చకుడికి చెందిన అన్నదమ్ములు కలియమూర్తి, రవిచంద్రన్‌ హత్య కేసులో మాజీ సైనికులు పన్నీర్‌సెల్వం, నటరాజన్‌ సహా అన్బళగన్, రాఘవన్‌ అనే నలుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సోమవారం కడలూరు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు