లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు

4 Jun, 2021 06:40 IST|Sakshi

విద్యార్థినులకు లైంగిక వేధింపులు 

సాక్షి, చెనై : ఆశ్రమం, స్కూల్‌ పేరిట విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న బాబా లీలలు గురువారం వెలుగులోకి వచ్చాయి. శివశంకర్‌ అలియాస్‌ శివశంకర్‌ బాబా చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కం సమీపంలోని రామరాజ్యం పేరిట నగర్‌ ఏర్పాటు చేసుకుని, ఆశ్రమాన్ని, సుశిల్‌ హరి పేరిట ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను నడుపుతున్నాడు. పద్మశేషాద్రి స్కూల్లో కీచక టీచర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి.

ఇద్దరు విద్యార్థినులు శివశంకర్‌ బాబాపై ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో జరిగే పూజలు, నృత్య కార్యక్రమాల్లో బాబా లైంగిక వేధింపులు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులతోపాటు బాల బాలికలు, శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి రంగస్వామి నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. గురువారం ఆశ్రమంవద్దకు వెళ్లగా బాబా లేకపోవడంతో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

చదవండి: తన భార్యను కరిచిందని కుక్కపై ప్రతీకారం..   
భార్యను చంపి, శవాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు