లిఫ్ట్‌ పేరుతో టీచర్‌ను కారులో ఎక్కించుకుని.. ఆ తర్వాత..

24 Mar, 2022 10:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి అఘాయిత్యం

సాక్షి, ఖమ్మం : పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాలిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 17వ తేదీన ఘటన జరగగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్‌(ఖానాపురం హవేలీ) పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో ఖమ్మంకు చెందిన బి.కిషోర్, ఆయన భార్య ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు ప్రతిరోజు కారులో వెళ్లి వస్తుండే వారు.

ఇదే మండలంలోని మరో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఖమ్మం నుంచి రైలులో వెళ్లి వచ్చేది. ఒకటిరెండు సార్లు భార్యాభర్తలతో పాటు కారులో ఆమెను తీసుకెళ్లారు. ఈక్రమంలో సదరు మహిళపై కన్నేసిన కిషోర్‌ ఈనెల 17న సాయంత్రం గార్ల రైల్వేస్టేషన్‌లో ఉన్న మహిళ వద్దకు వెళ్లి ఖమ్మంలో దింపుతామని నమ్మబలికాడు. తన భార్య కూడా తర్వాత స్టేజీలో కారు ఎక్కుతుందని చెప్పగా మహిళ నమ్మి బయలుదేరింది.
చదవండి: టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని 

ఆ తర్వాత ఓ స్టేజీ, అనంతరం ఇంకో స్టేజీ అని నమ్మిస్తూ ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆమెను తీసుకెళ్లి కిషోర్‌ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా ఉన్నందున విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడు. అయితే, సదరు మహిళ విషయాన్ని తన భర్తకు తెలపగా, వారు ఖమ్మం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు