కరోనా భయం: బావిలో దూకిన టీచర్‌

7 May, 2021 11:26 IST|Sakshi

వేలూరు:  వేలూరు జిల్లా లత్తేరి సమీపంలోని పాట్టియనూరు గ్రామానికి చెందిన  ఏలుమలై(40) మేల్‌మాయిల్‌లోని ప్రభుత్వ పాఠశాల లో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి గత వారం రోజులుగా జలుపు, దగ్గు లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేసుకున్నాడు. పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈనెల 3న వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.  అయితే బుధవారం ఉన్న ఫలంగా మాయమయ్యాడు.

ఈ క్రమంలో గురువారం ఆసుపత్రి సమీపంలోని చిరుకరుంబూరులోని వ్యవసాయ బావిలో మృతదేహం బావిలో తేలుతుండటంతో స్థానికులు గమనించి వేలూరు పోలీసులకు సమాచామిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోని మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టగా.. కరోనా భయంతో పరారైన ఏలుమలైగా గుర్తించారు.

దంపతుల హఠాన్మరణం 
టీ.నగర్‌: ఎర్నావూరులో గుండెపోటుతో భర్త మృతి చెందిన కొద్దిసేపట్లోనే భార్య కూడా మరణించింది. ఎర్నావూరుకు చెందిన త్యాగరాజన్‌ (63) రిటైర్డ్‌ విద్యుత్‌ ఉద్యోగి. ఇతని భార్య రాజ్యలక్ష్మి (53). వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల రాజ్యలక్ష్మికి అనారోగ్యానికి గురవడంతో స్టాన్లీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలావుండగా ఇంట్లో ఉంటున్న త్యాగరాజన్‌కు బుధవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ విషయం తల్లికి చెబితే మనోవేదనకు గురైతుందని భావించిన పిల్లలు ఆమెకు చెప్పలేదు. అయితే కొద్ది సేపటికే రాజ్యలక్ష్మి కూడా ప్రాణాలు విడిచింది. ఎర్నావూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కోలీవుడ్‌లో కరోనా మరణ మృదంగం


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు