జీతం అడిగితే.. అశ్లీల వీడియోలు

22 Sep, 2020 12:51 IST|Sakshi

మీరట్‌ : యూపీలోని మీరట్‌లో స్కూల్‌ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక​ టాయిలెట్స్‌లో రహస్యంగా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి అశ్లీల వీడియోలు తీసినట్లు బయటపడింది. వివరాలు.. మీరట్‌లోని సర్ధార్‌ బజార్‌లో రిషబ్‌ అకాడమీ స్కూల్‌ నడుపుతున్నారు. లాక్‌డౌన్‌ ఉండడంతో పాఠశాలను మూసివేశారు. దీంతో ఆ స్కూల్‌లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు అందాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్‌ జైన్‌ అతని కొడుకు అభినవ్‌ జైన్‌లు జీతాలు ఇవ్వకుండా వేధించడమే గాక మహిళల టాయిలెట్‌ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తేలింది.(చదవండి : విషాదం: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్య)

జీతాలు అడగానికి వచ్చిన సదరు మహిళా ఉపాధ్యాయులకు వారి వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది.  దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రంజిత్‌, అభినవ్‌లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా తండ్రీ, కొడుకులు తమకు తెలియకుండా తీసిన రహస్య వీడియోలను చూపించి చనువుగా ఉండాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఒక మహిళ ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము వారికి లొంగకపోతే చేతబడి చేయించి మమ్మల్ని చంపేందుకు కూడా వెనకాడమని బెదిరించారంటూ మరికొందరు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. (చదవండి : ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా