క్యాంపస్‌లో దారుణం: లైంగిక దాడి ఆపై వీడియో తీసి..

12 Oct, 2020 12:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : యూపీలోని ఝాన్సీలో కూతవేటు దూరంలో పోలీసు భద్రత నడుమ సివిల్‌ సర్వీసు పరీక్షలు జరుగుతుండగానే కళాశాల క్యాంపస్‌లోనే విద్యార్థిని(17)పై పాలిటెక్నిక్‌ కాలేజ్‌ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, అభ్యంతరకర వీడియోలు తీసి హింసించడం కలకలం రేపింది. యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళుతుండగా ఈ దారుణం జరిగిందని, బాధితురాలి స్నేహితుడిపైనా నిందితులు దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు.

పాలిటెక్నిక్‌ కాలేజ్‌కు చెందిన దాదాపు పన్నెండు మంది విద్యార్ధులు ఆదివారం తనను అడ్డగించి క్యాంపస్‌లోకి బలవంతంగా తీసుకెళ్లారని, వారిలో ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మిగిలిన వారు ఈ దారుణాన్ని వీడియో తీశారని చెప్పారు. నిందితులు ఆమె వద్ద నుంచి 2000 రూపాయలు లాక్కున్నారని పోలీసులు తెలిపారు. భారీ పోలీసు భద్రత నడుమ ప్రొవిన్షియల్‌ సివిల్‌ సర్వీసుల (పీసీఎస్‌) పరీక్షలు జరుగుతున్న సమయంలో క్యాంపస్‌లో ఈ ఘటన జరగడం కలకలం రేపింది.

బాధితురాలి అరుపులు విన్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దారుణ ఘటన వెలుగుచూసింది. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని భరత్‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితులంతా పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులని కళాశాల ప్రిన్సిపల్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు. వీరు హాస్టల్‌లో ఉంటున్న వారా కాదా అనేది నిర్ధారించాల్సి ఉందని, తాను ఆ సమయంలో పీసీఎస్‌ పరీక్షలతో బిజీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాన నిందితులు ఇద్దరినీ అరెస్ట్‌ చేశామని ఎస్‌ఎస్‌పీ దినేష్‌ కుమార్‌  వెల్లడించారు. చదవండి : నేడు హైకోర్టుకు హాథ్రస్‌ బాధిత కుటుంబం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా