కొత్త సిమ్‌ కొనివ్వలేదని ఆత్మహత్య

18 Mar, 2022 08:50 IST|Sakshi

సాక్షి,గుండాల(ఖమ్మం): సెల్‌ ఫోన్‌లోకి సిమ్‌కార్డు కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. గుండాల మండలం నర్సాపురానికి చెందిన సనప ముసలయ్య – పద్మ దంపతుల కుమారుడు ప్రేమ్‌సాగర్‌(17) ఉన్నాడు. ఆయన ఫోన్‌లో ఉన్న సిమ్‌కు సిగ్నల్‌ సరిగ్గా రానందున మరో సిమ్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు.

దీనికి వారు నిరాకరించడంతో మనస్తాపంతో గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయనను గుండాల ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై సురేష్‌ తెలిపారు.
(చదవండి: పెళ్లైన నెలకే భర్తకి షాక్‌.. ప్రియుడితో కలిసి.. )

మరిన్ని వార్తలు