ఘోరం: మైన‌ర్ బాలిక‌పై 30 మంది అత్యాచారం

21 Aug, 2020 18:31 IST|Sakshi

జెరూస‌లేం: ఇజ్రాయెల్‌లో దారుణం జ‌రిగింది. మైన‌ర్ బాలిక‌ను 30 మంది మాన‌వ మృ‌గాలు అత్యాచారం చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల‌ ప్ర‌కారం.. ఈలాత్ న‌గ‌రంలోని రెడ్ సీ రిసార్ట్ చూడ‌టానికి వెళ్లిన ప‌ద‌హారేళ్ల బాలిక‌పై మాన‌వ మృగాల క‌న్ను ప‌డింది. దీంతో అదే రిసార్ట్‌లో ఆమెను గ‌దిలో నిర్బంధించి ఆమెపై ముప్పై మంది అత్యాచారం చేశారు. ఈ ఘ‌ట‌న‌తో కుంగిపోయిన ఆ బాలిక‌ త‌న‌కు జ‌రిగిన ఘోరాన్ని గ‌త‌వారం పోలీసుల‌కు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు గురువారం ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. మ‌రోవైపు ఈ వార్త‌తో దేశ‌మంతా ఉలిక్కిప‌డ‌గా, అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు పెల్లుబికాయి. (ఫేస్‌బుక్‌లో ప్రియురాలి ఫొటో, సెల్‌నెంబర్‌...)

ఇంత‌టి క్రూర‌మైన నేరానికి పాల్ప‌డ్డ దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, అమ్మాయిల‌పై దారుణాల‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని నిన‌దిస్తూ తెల్ అవివ్‌, జెరూస‌లేం న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై దేశ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు స్పందిస్తూ ఇది షాకింగ్‌గా ఉంద‌‌ని, అస‌లు మాట‌లు రావ‌డం లేద‌న్నారు. నిందితుల‌పై విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. "ఇది ఓ అమ్మాయిపై జ‌రిగిన అఘాయిత్యం మాత్ర‌మే కాదు, మాన‌వ‌త్వాన్ని వంచించి చేసిన‌ నేరం. దీన్ని మ‌నం అంద‌రం ఖండించాల్సిన అవ‌స‌రం ఉంద‌"ని ఆ దేశ‌ అధ్య‌క్షుడు ర్యూవెన్ రివ్లిన్ అన్నారు. ఇజ్రాయెల్‌లోని ప్ర‌తి ఐదుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రు అత్యాచారానికి గుర‌వుతున్నార‌ని 'మ‌స్టికెరియాట్' మ‌హిళా హ‌క్కుల సంఘం కార్య‌క‌ర్త ఇలానా వెజ్‌మాన్ తెలిపారు. అబ్బాయిల‌కు చిన్న త‌నం నుంచే ఈ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పేర్కొన్నారు. (వివాహితపై సామూహిక లైంగిక దాడి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా