ప్రగతి భవన్‌ వద్ద కలకలం: ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

15 Jul, 2021 03:28 IST|Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్న సమయంలోనే ప్రగతి భవన్‌ ముందు ఓ ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. మెదక్‌ జిల్లా, చిన్నశంకరం పేటకు చెందిన మొయినుద్దీన్‌ (38) బుధవారం సాయంత్రం తన ఆటోలో ప్రగతి భవన్‌ వద్దకు వచ్చి, బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ ఒంటి పైన పోసుకున్నాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువులు ఊర్లోఉన్న 100 గజాల ఇంటిని, స్థలాన్ని ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరేందుకే అక్కడికి వచ్చానని వెల్లడించాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు