భూమి అమ్మకుండా అడ్డుపడుతున్నాడని..

13 May, 2022 03:41 IST|Sakshi
శ్రీను (ఫైల్‌), రాజశేఖర్‌, సంతోష్‌  

తండ్రిని నరికి చంపిన కుమారులు

పరారీలో ఇద్దరు నిందితులు 

సూర్యాపేట జిల్లాలో దారుణం 

ఆత్మకూర్‌ (ఎస్‌) (సూర్యాపేట): ఆర్థిక ఇబ్బం దుల కారణంగా భూమిని కొంత అమ్ముదా మంటే తండ్రి వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు కొడుకులు తండ్రిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండల పరిధిలోని తుమ్మల పెన్‌పహాడ్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తుమ్మల పెన్‌పహాడ్‌కు చెందిన యరగాని శ్రీను (50) అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారు లు రాజశేఖర్, సంతోష్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉ న్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశారు. వీరికి గ్రా మంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండ గా ఇద్దరు కుమారులకు మూడున్నర ఎకరాల చొప్పున రాసిచ్చారు. మిగతా రెండు ఎకరాల ను శ్రీను తన వద్దే పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు రాజశేఖర్‌ డీసీఎం డ్రైవర్‌ కాగా, చిన్న కుమారుడు సంతోష్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌. 

కుమార్తెకు అమ్మిచ్చి!: ఆర్థిక ఇబ్బందులతో భూమిని విక్రయించేందుకు రాజశేఖర్, సంతో శ్‌ సిద్ధపడగా.. తండ్రి శ్రీను అడ్డుపడ్డాడు. దీని పై తండ్రితో పలుమార్లు ఘర్షణపడ్డారు. పెద్ద లు సైతం అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించవచ్చని చెప్పినా తండ్రి వినలేదు. అదీగాకుండా తమ వద్ద ఉన్న రెండు ఎకరాల్లో కూతురు రాజ్య లక్ష్మికి పెళ్లి సమయంలో ఒప్పుకున్న ప్రకారం అర ఎకరం భూమిని కుమారులకు తెలియకుండా ఆమె పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశారు.

ఈ భూమిని ఇటీవల విక్రయించారు. దీంతో తమ భూమి అమ్మకానికి అడ్డుపడటం, సోదరికి భూమి రిజిస్ట్రేషన్‌ చేయించడంతోపాటు విక్రయించి ఇవ్వడంతో కుమారులు తండ్రిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తల్లి అంజమ్మ కూలికి వెళ్లగా.. అన్నదమ్ములు కత్తి, గొడ్డలితో వచ్చి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. అంజమ్మ ఫిర్యాదుతో రాజశేఖర్, సంతోష్‌పై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు