‘ఖాకీ’ని తలపించే చేజింగ్‌, 45 రోజుల ఆపరేషన్‌

16 Jan, 2021 19:07 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కార్తీ హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్‌ ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్‌ ఆపరేషన్‌ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్‌, బెంగళూర్‌, షోలాపూర్‌, బీదర్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగింది. 

ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్‌ పోలీసులు షోలాపూర్‌లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్‌ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్‌ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్‌ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్‌ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.
(చదవండి: 200కు పైగా ఇన్‌స్టా‍ంట్‌ లోన్‌యాప్స్‌ తొలగింపు..)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు