అమెరికాలో మియాపూర్‌ వాసి మృతి 

22 Jun, 2021 06:51 IST|Sakshi
ప్రవీణ్‌కుమార్‌ (ఫైల్‌)

బోటింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన  

మియాపూర్‌: అమెరికాలో బోటింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు  మియాపూర్‌కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా, అత్తలూరు గ్రామానికి చెందిన మాజీనేని నాగ వెంకట శ్రీనివాస్‌రావు, రమాదేవి దంపతులు నగరంలోని మియాపూర్‌ జనప్రియ వెస్ట్‌ సిటీలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌(30) 2011లో ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లాడు.

ప్రస్తుతం టెక్‌సెస్‌ స్టేట్‌లోని ఆస్టిన్‌ నగరంలో ఉంటూ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 18న  సాయంత్రం సమీపంలోని ఓ లెక్‌లో బోటింగ్‌ చేసేందుకు వెళ్లిన ప్రవీణ్‌ ప్రమాదవశాత్తు లెక్‌లో మునిగిపోయాడు.  

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని వెలికి తీసి, అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం ప్రవీణ్‌ కుమార్‌ మృతదేహం నగరానికి చేరుకోచ్చునని కుటుంబీకులు తెలిపారు. 

చదవండి: శామీర్‌పేట చెరువులో శవాలై తేలిన డాక్టర్లు, సెల్ఫీనే కారణమా?

మరిన్ని వార్తలు