పుట్టింటికి వెళ్తున్నానని భర్తకి చెప్పి..

6 Jun, 2022 11:35 IST|Sakshi

సాక్షి,తాండూరు: తల్లి, కూతుళ్లు అదృశ్యమైన ఘటన కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్లాపూర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కొత్లాపూర్‌కు చెందిన అతియ పర్వీన్, ఎండీ పాషా దంపతులు. వీరికి కూతుళ్లు అఫియానాజ్, జోయ తసి ఖాన్‌లు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు.

ఏప్రిల్‌ 24న పర్వీన్‌ తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని తల్లిగారి ఊరైన కర్ణాటక రాష్ట్రం పెద్ద ఐనెల్లి గ్రామానికి వెళ్తున్నానని భర్తకు చెప్పి బస్సులో వెళ్లింది. పర్వీన్‌ తన తల్లిగారి ఇంటికి వెళ్లలేదు. దీంతో పర్వీన్‌ కోసం బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించలేదు. భర్త పాషా ఆదివారం కరన్‌ కోట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: Fake Police: చిన్న పని వుంది... ఒక్కసారి బైక్‌ ఇస్తే వెళ్లి వచ్చేస్తా..

మరిన్ని వార్తలు