డాడీ వెరీ బ్యాడ్‌.. నరకం చూపిస్తున్నాడు!

24 May, 2022 01:41 IST|Sakshi
అనుషా మృతదేహం 

టెన్త్‌ పరీక్షలు రాయాల్సిన విద్యార్థిని.. సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య 

రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటన 

నందిగామ: పదో తరగతి పరీక్షలు రాయాల్సిన ఆ విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ రాసింది. సోమవారం నుంచి పరీక్షలకు హాజరు కావాల్సిన ఆమె తన తండ్రి వేధింపులకు తాళలేక తనువు చాలించింది. ‘‘మా డాడీ వెరీ బ్యాడ్‌. అతడిని నాన్న అని పిలవాలంటేనే అసహ్యం వేస్తోంది. నరకం చూపి స్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా’ అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. నందిగామ మండలం బుగ్గోనిగూడకు చెందిన మొగిలిగిద్ద నర్సింహ భార్య గతేడాది చనిపోవడం తో కొడుకు శ్రవణ్‌ కుమార్, కూతురు మనీషా అలి యాస్‌ అనుషా (16)తో కలసి ఉంటున్నాడు. మనీషా చేగూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో పదో తరగతి చదువుతుండగా, శ్రవణ్‌ సమీపంలోని కాన్హా శాంతి వనంలో ఎలక్ట్రికల్‌ స్టోర్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు. నర్సింహ నిత్యం తాగొచ్చి కొడుకు, కూతురుతో గొడవ పడేవాడు. దీంతో శ్రవణ్‌ తాను పనిచేస్తున్నచోటనే నివాసం ఉంటు న్నాడు.

ఇదే అదనుగా భావించిన నర్సింహ తన కూతురును మరింత వేధింపులకు గురిచేసేవాడు. తండ్రి వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపో యిన మనీషా ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది. రోజుమాదిరిగా తాగి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా పడి ఉండటంతో కొడుక్కి ఫోన్‌ చేశాడు. శ్రవణ్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు.  తండ్రి వేధింపులు భరించలేక, అవమానాలను తట్టుకోలేకనే చెల్లి ఆత్మహత్య చేసుకుందని శ్రవణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.

ఆత్మహత్య లేఖలో ఏముందంటే.. 
ఘటనాస్థలంలో లభించిన నోటుపుస్తకంలో ఆత్మ హత్యకు గల కారణాలను మనీషా స్పష్టంగా పేర్కొంది. ‘ఐ హేట్‌ మై డాడ్‌’అని నాలుగుసార్లు, మా నాన్న మంచివాడు కాదు, దరిద్రుడు, గలీజో డు. నాన్న అని పిలవడానికి కూడా చాలా అస హ్యం వేస్తోంది. నాన్నను చంపాలని ఉంది. లేదా నేనన్నా చావాలని ఉంది. ఐ యాం వెయింటింగ్‌ ఫర్‌ డెత్‌’ అని రాసి ఉన్న లేఖ అక్కడ లభించింది. కాగా, నిందితుడు నర్సింహను పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు