పక్క తడిపాడని కన్నతండ్రే..

1 Mar, 2021 11:10 IST|Sakshi

ముంబై: ముంబైలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కన్న కొడుకును చిత్రహింసలకు గురిచేసాడు. వివరాల్లోకి వెళ్తే.. థానేలోని వాగ్లేకర్‌ ఎస్టేట్స్‌లో ఓవ్యక్తి తన రెండో భార్యతో కలిసి మొదటి భార్య కుమారుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 9 ఏళ్ల పిల్లాడు నిద్రలో పక్కతడిపినందుకు అతన్ని చిత్రహింసలు పెట్టాడు. పిల్లాన్ని చితకబాది భార్యాభర్తలిద్దరూ పైశాచికానందం పొందారు. అంతటితో ఆగకుండా బాలుని ప్రైవేటు భాగాలపై వాతలు పెట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఈ ఘటన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చదవండి: మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు