దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..

9 Nov, 2021 17:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

థానె: బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన వీటిని అరికట్టడం అంత సులువులా కనిపించడం లేదు. తాజాగా ఓ వృద్ధురాలిపై 25 ఏండ్ల సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణం మ‌హారాష్ట్ర‌లోని థానె జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. థానె న‌గ‌రంలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఓ యువకుడు సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. ఆ సొసైటీలోని ఒక ఇంట్లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. అప్పుడప్పుడు ఆమె బంధువులు తనని చూడటానికి వచ్చి పోతూ ఉంటారు. ఇదంతా గమనించిన ఆ యువకుడు ఓ రోజు మంచినీళ్ల నెపంతో వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లాడు. ఆమె నీళ్లు తీసుకుని వ‌చ్చేలోపు అదును చూసి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ నెల 3న ఈ దారుణం జరగగా.. ఘటన జరిగినప్పటి నుంచి ఆమె బాధపడుతూ ఉండేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను డాక్టర్ దగరకు తీసుకెళ్లగా నిజం బయటపెట్టింది. దీంతో వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అత‌నిపై సంబంధిత సెక్ష‌న్‌ల కింద కేసులు న‌మోదు చేశారు.

చదవండి: స్నానం పూర్తి చేసుకున్న భర్త.. టవల్‌ త్వరగా ఇవ్వలేదని భార్య తలపై...

మరిన్ని వార్తలు