కసాయి తల్లి...మరో పెళ్లి కోసం నెలల పసికందుని....

18 May, 2022 21:43 IST|Sakshi

సాక్షి ముంబై: వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని తమ కన్న పిల్లల్నే హతమారుస్తున్న కసాయి తల్లిదండ్రులను చూస్తున్నాం. మరికొంతమంది తమ అక్రమసంబంధాలు గురించి పిల్లలకు తెలిసిపోయిందనో లేక వాళ్లు చూశారనో చంపేస్తున్నారు. కొంతమంది జంటలు విడాకులు తీసుకుని మరోకరితో కొత్తజీవితాన్ని పంచుకునేందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారని వాళ్లను రోడ్ల మీద, బస్టాండ్‌ల్లోనూ, లేదా చెత్తబుట్టలోనూ వదిలేసి వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడో మహిళ అలాంటి దారుణానికే పాల్పడింది.

వివరాల్లోకెళ్తే...ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లోని డస్ట్‌బిన్ దగ్గర 15 రోజుల పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయిన 22 ఏళ్ల మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బీహార్‌లోని తన గ్రామంలో వయస్సులో తన కంటే రెట్టింపు వయసు ఉన్న వ్యక్తికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆ మహిళ తెలిపింది.

పెళ్లైయిన కొన్ని నెలలు తర్వాత ఆమె తన భర్త ఇంటి నుంచి పారిపోయి తన సోదరుడి సహాయంతో మహారాష్ట్రకు వచ్చి ఖడావ్లీలో నివసిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తాను గర్భవతినని తెలుసుకుంది. ఐతే ఆమె మరొ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె ఉల్హాసనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది.

ఆ తర్వాత ఆ మహిళ తన సోదరుడి సాయంతో ఆ బిడ్డను మెరైన్ డ్రైవ్‌కు సమీపంలోని డస్ట్‌బిన్ దగ్గర శిశువును వదిలి వెళ్లిపోయారు. పైగా ఆ బిడ్డను డబ్బున్న కుటుంబం దత్తత తీసుకుంటుందని భావించాం అని  చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు మెరైన్ డ్రైవ్ పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సదరు మహిళను గుర్తించినట్లు వెల్లడించారు. 

(చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి..)

మరిన్ని వార్తలు