ఉంగరాలు మింగేసిన దొంగ

1 Jun, 2021 01:11 IST|Sakshi
దొంగ శిబు, కడుపులో నుంచి తీసిన ఉంగరాలు   

ఆపరేషన్‌ ద్వారా తొలగింపు  

బనశంకరి: పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు. ఈ సంఘటన కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు.

ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు