విషాదం: మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా..

10 Aug, 2021 06:44 IST|Sakshi

ప్రాణం తీసిన కరెంటు షాక్‌

తల్లీ, కూతురు, మనవరాలి మృతి

క్రిష్ణగిరి(కర్ణాటక): క్రిష్ణగిరి సమీపంలో జరిగిన కరెంటు షాక్‌తో తల్లీ కూతురు, మనవరాలు ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర (52), ఆమె కూతురు మహాలక్ష్మి (25). ఈమెకు మిట్టపల్లికి చెందిన శివతో గత నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగి మూడేళ్ల కూతురుంది. ఇటీవల పుట్టింటికి చేరుకుంది.

ఆదివారం సాయంత్రం ఇంద్ర మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా ఆకస్మాత్తుగా వైర్లు తగిలి కరెంటు షాక్‌ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో కూతురు మిద్దెపైకెళ్లి రక్షించే యత్నంలో ముగ్గురికీ షాక్‌ తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సింగారపేట పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సింగారపేట ప్రాంతంలో సంచలనం సృష్టించింది.   

మరిన్ని వార్తలు