గోడ కూలి ముగ్గురు మృతి

23 Sep, 2023 02:53 IST|Sakshi

హనుమకొండ జిల్లా శాయంపేటలో ఘటన

శాయంపేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలి ముగ్గురు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలోశుక్రవారం  చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథ నం ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముష్కే భాగ్య లక్ష్మికి చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరుకొని పైకప్పు కూలిపోయింది. దీంతో దాని పక్కనే ఆమె చిన్న రేకుల షెడ్డు వేసుకొని కిరా ణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆ ఇంటి పక్కనే జోగమ్మ (60) ఇల్లు ఉంది. శుక్ర వారం మధ్యాహ్నం జోగమ్మ తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఆమెపై మట్టిపెళ్లలు పడ్డాయి. అదే సమయంలో గోడ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మోర సాంబయ్య (65), లోకలబోయిన సారలక్ష్మి (55)లపై గోడ పూర్తిగా పడింది. స్థాని కులు మట్టిపెళ్లలు తొలగించి చూడగా అప్పటికే సాంబయ్య, సారలక్ష్మి విగతజీవులపై కనిపించా రు. జోగమ్మ నడుం, కాళ్లు విరిగిపోయాయి. 

అంబులెన్స్‌ ఆలస్యంతో పోయిన ప్రాణం
జోగమ్మను ఆసుపత్రికి తరలించడానికి స్థానికులు వెంటనే 108 నంబర్‌కు ఫోన్‌ చేసి అంబులెన్స్‌ పంపాలని కోరగా గంటా 15 నిమిషాల తర్వాత అంబులెన్స్‌ ఘటనాస్థలికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటనలో మృతిచెందిన మోరె సాంబయ్య స్థానికంగా పనిలేక సిరిసిల్లలో చేనేత పనిచేస్తూ జీవిస్తున్నాడు. వినాయక చవితి పండగ కోసం శాయంపేటకు వచ్చిన సాంబయ్య... బీడీలు కొనుక్కోవడం కోసం రోడ్డుపైకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఎస్సై దేవేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు