రసాయన పరిశ్రమలో ప్రమాదం

9 Jan, 2023 01:53 IST|Sakshi
ప్రమాదం జరిగింది ఇక్కడే 

ముగ్గురు సజీవ దహనం

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఘటన

జిన్నారం (పటాన్‌చెరు): మైలాన్‌ రసాయన పరిశ్రమ యూనిట్‌ – 1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆది వారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మైలాన్‌ పరి శ్రమ లోని లిక్వి డ్‌ రా మెటీరియల్స్‌ శాంపిల్‌ డిస్పెన్సింగ్‌ గదిలో 1.1.3.3 టెట్రా మిథైల్‌ డిసిలోక్సేన్‌ అనే రసాయన మెటీరియల్‌ను (దీనితో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తులకు అవసరమైన మందులు తయారు చేస్తారు) సుమారు 400– 500 డిగ్రీ సెల్సియస్‌లో వేడి చేసి దాని నుంచి జిప్రసైడోన్‌ ఇంటర్మీడియెట్‌ రసాయనం తయారు చేస్తుంటారు.

ఈ ప్లాంటులో పది మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే రసా యనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చా యి. యాసిడ్‌ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగ జిమ్మాయి. అవి ఒంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన పరితోష్‌ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్‌ (27) అనే ముగ్గురు అక్కడికక్కడే కాలి పోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చాయి. 

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..: ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను యాజమాన్యం హుటాహుటి న ఆస్పత్రికి తరలించింది. ఘటన జరిగిన గంటసేపటి తర్వాత పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు పరిశ్రమకు చేరుకున్నారు. మరోవైపు వార్తను కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను యాజమాన్యం ఘటనా స్థలా నికి పంపలేదు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించేలా యాజ మాన్యం చర్యలు తీసు కోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నామని సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాకర్టీస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు