Family Commits Suicide: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..

17 Dec, 2021 21:00 IST|Sakshi

బెంగళూరు(తుమకూరు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హేమావతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా చేళూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను కేబీ క్రాస్‌ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్‌(55), అతని భార్య మమత(46), కుమార్తె శుభ(25)గా గుర్తించారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం కారులో సాగరనహళ్లి గేట్‌ వద్దకు చేరకుని హేమావతి కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాలువలో శవాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: (పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..)

మరిన్ని వార్తలు