గదినే గ్యాస్‌ చాంబర్‌గా మార్చి..

22 May, 2022 15:13 IST|Sakshi

న్యూఢి‍ల్లీ: కరోనా చాలమంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఆ మహమ్మారి బారినపడి చనిపోయిన వారు కొందరైతే. కొన్ని కుంటుంబాల్లో ఇంటి పెద్ద దిక్కును తీసుకుపోయి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ మహమ్మారి ఎంతోమందిని అనాథలుగా మార్చేసింది. దిక్కుతోచక తమను చూసుకునే ఆత్మీయులు లేరంటూ నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కోకొల్లలు. అచ్చం అలానే ఇక్కడొక కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో వసంత్ విహార్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... వసంత్ అపార్ట్‌మెంట్ సొసైటీలోని ఓ గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఐతే చుట్టుపక్కల ఫ్లాట్‌వాళ్లు తలుపులు కొడుతున్న తీయడం లేదంటూ అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తలుపులు పగలు గొట్టి చూడగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడిఉన్నారు. "ఇంట్లో పోయ్యి వెలిగించి ఉందని, గ్యాస్‌సిలిండర్‌ కూడా ఓపెన్‌ చేసి ఉంది. ఇంటి నిండ విషవాయువు ఉంది. దయచేసి అగ్గిపుల్ల, లైటర్లు వెలిగించకండి" అని ఒక సూసైడ్‌ నోట్‌ రాసి ఉంది. అంతేకాదు వారు ఆత్మహత్య చేసుకునే పథకంలో భాగంగా ఇంటి కిటికీలను, తలుపులను పాలిథిన్‌ కవర్‌తో ప్యాక్‌ చేశారు. దీంతో వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని అంటున్నారు.

కరోనా కారణంగా 2021 ఏప్రిల్‌లో తండ్రి చనిపోయాడని అప్పటి నుంచి కుటుంబం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైందని, పైగా తల్లి మంజు కూడా అనారోగ్యంతో మంచం పట్టి ఉండటంతో ఆ కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: ‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !)

మరిన్ని వార్తలు