గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు

2 Apr, 2022 17:08 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ఉగాది పండుగ రోజున ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం రోహీర్‌ గ్రామ సమీపంలోని గోదావరి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రోహీర్‌ గ్రామానికి చెందిన డోంగిరి సందీప్, ఆకుదారి సాయివర్దన్, సతీష్ బెడిక ముగ్గురు విద్యార్ధులు ఉగాది పండుగ రోజున గోదావరిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటిలో దిగి ఈత కొడుతుండగా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు గ‌ల్లంతైన వారి గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు.
చదవండి: అలాంటి వారు వెంటనే అన్‌ఫాలో కండి: కేటీఆర్‌ 

మరిన్ని వార్తలు