మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి

23 Sep, 2022 13:22 IST|Sakshi

అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపింది. ఈ ఘటన సౌత​ కరోలినాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది. అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి  వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది.

ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు. బాధితురాలు స్పార్టన్‌బర్గ్‌లో నివశించే కోరా లిన్‌ బుష్‌ అనే మహిళగా గుర్తించారు అధికారులు. ఇలా యూఎస్‌లోని చిన్నారుల్లో దాదాపు 194 మంది ప్రమాదవశాత్తు కాల్పులు జరిపారని, అందువల్ల సుమారు 82 మంది మరణించగా, 123 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 

(చదవండి: అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్‌ వద్దు..హెచ్చరించిన పుతిన్‌)

మరిన్ని వార్తలు