అమ్నీషియా పబ్‌ కేసు: వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్‌

4 Jun, 2022 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్‌పై లైంగిక దాడికి పాల‍్పడ్డారు. కాగా, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు.

పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఒక మేజర్‌, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్ (18 ), వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు (16)తో పాటు మరో మైనర్ (16)ను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వెల్లడించారు.  

ఇది కూడా చదవండి: పబ్‌కు వచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం.. అసలేం జరిగింది?

మరిన్ని వార్తలు