కాళ్లు మొక్కుతా.. వదిలేయండి

27 Jan, 2023 01:17 IST|Sakshi

బాలిక ప్రాధేయపడినా ముగ్గురు యువకుల అఘాయిత్యం

తొలుత ప్రేమ పేరిట గాలం వేసిన ఓ యువకుడు.. కొంతకాలంగా లైంగిక దాడి 

మంగళవారం ఇద్దరు స్నేహితులతో కలిసి దారుణం 

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

ఖిలా వరంగల్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ బాలిక.. క్లాస్‌మేట్‌ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ప్రేమ, పెళ్లి పేరిట శారీరకంగా లొంగదీసుకున్నా డు.. మాట్లాడుకుందామని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ‘కాళ్లు మొ క్కుతా వదిలేయండి’అని ప్రాధేయపడ్డా వదలలేదు. చివరికి  విషయం బయటికి చెప్పొద్దని బెదిరించి ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఆవేదన భరించలేని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్‌ కాశీబుగ్గలో మంగళవారం జరి గిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

తండ్రి లేని బాలిక..: పోలీసుల కథనం ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.. భర్తను కోల్పోవడంతో తమ గ్రామాన్ని వీడి ఇద్దరు కుమార్తెలతో వరంగల్‌ కాశిబుగ్గకు వలస వచ్చింది. అద్దె ఇంట్లో ఉంటూ, కూలి పనులకు వెళ్తూ  కుమార్తెలను చదివిస్తోంది. పెద్ద కుమార్తె ఇంటర్‌ సెకండియర్, చిన్నకుమార్తె ఫస్టియర్‌ చదువుతున్నారు. ఫస్టియర్‌ చదువుతున్న బాలికకు అదే కాలేజీలో చదివే స్నేహితురాలి ద్వారా నర్సంపేట సమీపంలోని మాదన్నపేటకు చెందిన దూడల ప్రభాస్‌ (22)తో పరిచయం ఏర్పడింది. ప్రభాస్‌ ప్రేమ పేరిట బాలికను నమ్మించాడు. పలుమార్లు మాదన్నపేటకు రప్పించుకున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

మాట్లాడుకుందాం రమ్మని చెప్పి.. 
ప్రభాస్‌ మంగళవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి ఆ బాలికను మాదన్నపేటకు రప్పించాడు. ఇంట్లో బంధువులు ఉన్నారని, బయటికి వెళ్దామని చెప్పాడు. తన స్నేహితులు భరత్, బన్నిలను అడిగితే ఖిలా వరంగల్‌ శివార్లలో నిర్మానుష్య ప్రదేశాలు ఉన్నాయని చెప్పారని.. అటు తీసుకెళ్లాడు. బైక్‌పై ఆ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికే భరత్, బన్ని, మరో యువకుడు కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఏం చేస్తున్నారని బెదిరిస్తున్నట్టుగా నటిస్తూ.. బాలి క సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. ‘కాళ్లు మొక్కుతా నన్ను వదిలేయండి’అని ప్రాధేయపడినా వినకుండా భరత్, బన్ని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరో యువకుడు వారికి కాపలా ఉన్నాడు. బాలిక ఈ ఘటనతో షాక్‌లోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. ఆమె తిరిగి లేచే వరకు ప్రభాస్‌ అక్కడే ఉన్నాడు. అత్యాచారం విషయాన్ని బాలిక తల్లికి చెప్తుందేమోనని భయపడి.. ఆమెను మాదన్నపేటలోని అతడి బావ అనిల్‌ ఇంటికి తీసుకెళ్లాడు.

బాలిక తనపై జరిగిన దారుణాన్ని చెప్పడంతో అనిల్, బాలికను అద్దె కారులో ఇంటికి పంపించారు. తర్వాత బాలిక ఘటనను తల్లికి చెప్పగా.. బుధవారం  పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులతోపాటు వీరికి సహకరించిన మరో వ్యక్తిపై దాడి, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు