-

కుమార్తె సీమంతం..   గంటల్లోపే మృత్యు ఒడికి తండ్రి 

23 Sep, 2022 09:21 IST|Sakshi

కళ్యాణదుర్గం: కుమార్తె సీమంతం ఘనంగా జరిపిన 24 గంటల్లోపే ఆ ఇంట విషాదం నెలకొంది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన గంగవరం గంగన్న (52) ఒక్కగానొక్క కుమార్తె జయంతి సీమంతం వేడుకను బుధవారం బంధువుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. రాత్రి పొద్దుపోయాక గంగన్న ఛాతినొప్పితో విలవిల్లాడుతుంటే కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్న అతను ఛాతి నొప్పి రావడంతో మృతి చెందినట్లు అల్లుడు ప్రవీణ్‌ తెలిపారు. కాగా, గంగన్న గతంలో ఆర్డీటీ ఉపాధ్యాయుడిగా, ఆయన భార్య హంపమ్మ గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు.  

(చదవండి: విజయవాడలో దారుణం.. స్నేహితు పనేనా..?)

మరిన్ని వార్తలు