తిరుపతి: బిడ్డను చూస్తూ ఉండమంటే.. కిడ్నాప్‌, కథ సుఖాంతం

7 Aug, 2021 13:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో 4 నెలల పసికందు అపహరణ కేసును అలిపిరి పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌ చేసిన యాచకురాలు ఆశని అరెస్టు చేశారు. ఈనెల 2వ తేదీన బాలాజీ బస్టాండ్‌ దగ్గర గంగులమ్మ తన నాలుగు నెలల మగబిడ్డను స్నానం చేసి వస్తా.. కొద్దిసేపు చూస్తూ ఉండు అని ఆశకు అప్పగించింది. స్నానం చేసి వచ్చిచూసేసరికి తన బిడ్డతో పాటు ఆశ కూడా కనిపించలేదు. అంతటా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు నిందితురాలు ఆశ మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను తల్లి ఒడికి చేర్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు