ఎంపీతో అసభ్య ప్రవర్తన, ట్యాక్సీ డ్రైవర్‌ అరెస్టు

15 Sep, 2020 17:03 IST|Sakshi

కోల్‌కత: తృణమూల్‌‌ కాంగ్రెస్‌ ఎంపీ, హీరోయిన్‌ మిమి చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కత పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిమ్‌ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న ఎంపీ కారును పశ్చిమ బెంగాల్‌లోని గరియాహట్‌ వద్ద సదరు ట్యాక్సీ డ్రైవర్‌ వెంబడించడమే కాకుండా ఆసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్రైవర్‌ను మిమి పోలీసులకు పట్టించి అతడిపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం జిమ్‌ నుంచి తిరిగి వస్తున్న ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వెంబడించడం ఆమె గమనించారు. అతడు కారు పక్కనే తన ట్యాక్సీని తీసుకువచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే మొదట ఆమె దీనిని పట్టించకోకుండా తన దారిన తను వెళ్లిపోయారు. సదరు డ్రైవర్‌ మళ్లీ తన కారును ఓవర్‌ టేక్‌ చేసి అదే తరహాలో ప్రవర్తించడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్‌ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్‌) 

ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు గరియాహట్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని మెట్ర పాలిటన్‌ బైపాస్‌ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్‌ యాదవ్ ‌(32)గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్‌ 354,354ఎ,354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంపీ మాట్లాడుతూ.. ‘నా కారును ఓ ట్యాక్సీ వెంబడించడం గమనించాను. నేను నా కారులో ఉన్నాను. అయితే ఆ డ్రైవర్‌ నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగ చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా నా కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతడు నా కారు అతి వేగంగా ఓవర్‌ టేక్‌ చేసి మళ్లీ అదే తరహా ఆసభ్యకరంగా సైన్‌ చేశాడు. ఇప్పుడు నేను అతడిని వదిలేస్తే ఆ తర్వాత అతడి ట్యాక్సీలో ప్రయాణించే మరికొందరూ స్త్రీలు కూడా అతడి వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అది సురక్షితం​ కాదని ఆలోచించాను. వెంటనే అతడి కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాను’ అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.(చదవండి: శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా