అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి

3 Apr, 2024 13:26 IST|Sakshi

ఏడాది బిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్య 

కూతురు, మనవడి మృతితో అమ్మమ్మ బలవన్మరణం

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలో విషాదం 

కరీంనగర్‌ రూరల్‌: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ విజయ్‌నగర్‌కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్‌ జిల్లా మొగ్ధుంపూర్‌కు చెందిన నరేశ్‌తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్‌... కొడుకు ఆర్యన్‌(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.

అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్‌లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్‌డే గురించి నరేశ్‌కు శ్రీజ ఫోన్‌ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్‌కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది.

అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers