ముగ్గురు పిల్లల తల్లిని బెల్ట్‌తో కొట్టి...భర్తని భుజాలపై మోసుకుని వెళ్లేలా శిక్షించారు!

4 Jul, 2022 19:49 IST|Sakshi

ప్రజలను రక్షించేందుకు పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. భార్యభర్తల్లో.. ఇద్దరిలో ఎవరి వల్ల అయిన సమస్య ఉంటే పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవడమే లేక కోర్టు ద్వారానో సమస్య పరిష్కరించుకోవడం వంటవి చేయాలి. అంతేగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఘోరంగా అవమానించి శిక్షించడం వంటివి చేయకూడదు. దీని వల్ల ఇద్దరి జీవితాలు నాశనమవ్వడమే కాకుండా కటకటాల పాలవ్వడం జరుగుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి భార్య తప్పుచేసిందని ఆమె పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడంటే...వినేందుకు, చూసేందుకు అత్యంత జుగుప్సకరమైన దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకెళ్తే...మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో గిరిజన మహిళను దారుణంగా హింసించి బహిరంగంగా అవమానించారు.  ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు. అంతటితో ఆగకుండా బూట్ల దండవేసి అవమానించారు. ఆ తర్వాత ఆమె తన భర్తను భుజాలపై మోసుకుని ఊరంతా తిరిగేలా దారుణమైన శిక్ష విధించారు.

ఈ ఘటన దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...బోర్‌పదవ్‌ గ్రామంలోని ఒక వ్యక్తి తన భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె అదే గ్రామంలో తన ప్రియుడి ఇంట్లో కనిపించింది. వివాహమై మరోకరితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో అతను బహిరంగంగా తన భార్యను అవమానించి, కొట్టి హింసించాడు.

స్థానికులు సైతం ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఐతే ఒక వృద్ధ జంట ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన సుమారు 12 మంది నిందుతులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య)

మరిన్ని వార్తలు