గిరిజన మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి

10 Oct, 2022 14:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామానికి గిరిజన వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ(30)కు భర్త , పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు,  ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు.

పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు, ఆదివారం ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు, బబాధితురాలు పేర్కొన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు, గ్యాంగ్‌ రేప్‌ సమాచారం అందుకున​ ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ రఘుపతి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు