పెళ్లికి నిరాక‌రించాడ‌ని ప్రియుడిపై యాసిడ్ దాడి

29 Oct, 2020 16:30 IST|Sakshi

అగ‌ర్త‌లా :  వివాహం చేసుకోవడానికి నిరాక‌రించాడ‌న్న కారణంతో  ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్ప‌డిన మ‌హిళ‌కు స్థానిక కోర్టు 14 రోజ‌లు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. వివ‌రాల ప్ర‌కారం..పెళ్లికి నిరాక‌రించాడ‌ని 27ఏళ్ల బిన‌తా సంత‌ల్ అనే మ‌హిళ ప్రియుడిపై యాసిడ్ దాడికి తెగ‌బ‌డిన ఘ‌ట‌న త్రిపురలోని ఖోవాయి జిల్లాలో చోట‌చేసుకుంది. ఈ దాడిలో ప్రియుడికి తీవ్ర గాయాలు కాగా ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. (కూతురి హత్య.. తండ్రికి జీవిత ఖైదు )

కాగా ఎనిమిదేళ్ల‌కు పైగా త‌న‌తో ప్రేమాయ‌ణం  నడిపి ఇటీవ‌లె మ‌రో మ‌హిళ‌తో స‌న్నిహితంగా  ఉండ‌టంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు నిందితురాలు విచార‌ణ‌లో పేర్కొంది. పాఠ‌శాల స్థాయి నుంచే ఇద్ద‌రం ఒక‌రినొక‌రం ప్రేమించుకుంటున్నామ‌ని, అయితే త‌న ప్రియుడు ఇటీవ‌లె మ‌రో మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉంటూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బిన‌తా పేర్కొంది. దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా పెళ్లిచేసుకోమ‌ని కోర‌గా స‌సేమిరా అన్నాడ‌ని, దీంతో యాసిడ్ దాడికి పాల్ప‌డిన‌ట్లు నిందితురాలు నేరం అంగీక‌రించింది. బాధితుడి కుటుంబ‌స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బిన‌తాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. (ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!! )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా