రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం

17 Aug, 2021 10:32 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కును..లారీ ఢీకొట్టింది. దీంతో.. ఒక్కసారిగా తీవ్ర మంటలు వ్యాపించాయి. కాగా,  సంఘటన స్థలంలోనే నలుగురు సజీవదహనయ్యారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 45 నిముషాల పాటు గ్యాస్‌ సిలిండర్ల పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అజ్మీర్‌-జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పెద్ద ఎత్తును ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

మరిన్ని వార్తలు