పండ్లను దిగుమతి చేసే ట్రక్‌లో వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలు

1 Oct, 2022 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: నారింజ పండ్లను తీసుకువెళ్లే ట్రక్‌లో దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను గుర్తించారు అధికారులు. ముంబైలోని నారింజ పండ్లను దిగుమతి చేసే ట్రక్‌లో సుమారు రూ. 1476 కోట్ల విలువైన మెథాంఫేటమిన్‌, కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలను తీసుకువెళ్తున్నట్లు కనుగొన్నారు. ఆ ట్రక్కును డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)  అధికారులు ఆపీ తనీఖీలు చేపట్టగా ఈ ఘటన వెలుగు చూసింది.

వాలెన్సియా ఆరెంజ్‌ డబ్బాల్లో 198 కిలోల హైప్యూరిటీ క్రిస్టల్‌ మెథాంఫెటమైన్‌, 9 కిలోల కొకైన్‌ ఉందని అదికారులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ డ్రగ్స్‌ దిగుమతి చేసుకుంటున్న వ్యక్తులను కూడా విచారించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

(చదవండి: శానిటరీ ప్యాడ్స్‌ ప్ర‍శ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ)

మరిన్ని వార్తలు